వీధి రౌడీలా మారిన బీజేపీ ఎమ్మెల్యే.. ఆక్రమణలు తొలగిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులపై బ్యాటుతో దాడి!

26-06-2019 Wed 14:36 | National
  • మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఘటన
  • ఆక్రమణలు తొలగిస్తున్న మున్సిపల్ ఉద్యోగులు
  • ఇంకోసారి కూడా కొడతానన్న ఆకాశ్ విజయవర్గీయ
అధికార పార్టీ నేతలు అంటే ప్రభుత్వం సాఫీగా సాగేలా పనిచేయాలి. ప్రజలకు-అధికారులకు మధ్య ఏవైనా గొడవ వస్తే ఓ పెద్దమనిషిలా ప్రవర్తించి సమస్యను పరిష్కరించాలి. కానీ మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే అకాశ్ విజయవర్గీయ అచ్చం ఓ వీధి రౌడీలా మారిపోయారు. ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఈరోజు అక్రమ కట్టడాలు తొలగించేందుకు వచ్చిన అధికారులపై క్రికెట్ బ్యాట్ తో దాడి చేశారు. తన అనుచరులతో కలిసి ప్రభుత్వ అధికారులను తరిమితరిమి కొట్టారు. చివరికి ఓ ఉద్యోగిని పట్టుకుని టీ షర్ట్ కూడా చించేశారు.

అన్నట్లు ఈ అకాశ్ విజయవర్గీయ బీజేపీ సీనియర్ నేత కైలాశ్ విజయవర్గీయ సుపుత్రుడు కావడం గమనార్హం. కాగా, ఈ దారుణ ఘటనను మౌన ప్రేక్షకులుగా చూసిన పోలీసులు.. చివరికి ప్రభుత్వ ఉద్యోగులను బీజేపీ శ్రేణుల చెర నుంచి కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా, కావాలంటే మరోసారి కూడా ప్రభుత్వ ఉద్యోగులను కొడతానని అకాశ్ విజయవర్గీయ సెలవివ్వడం గమనార్హం.
Madhya Pradesh

More Telugu News

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21
..more